ముంబై: టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపు అంశంలో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ గేట్ వద్దకు ఒక కారు వచ్చింది. అయితే టోల్ రుసుం చెల్లింపుపై వివాదం జరిగింది. దీంతో మహిళా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు బాహాబాహికి దిగారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని తోసుకున్నారు. మరాఠీలో అసభ్యంగా తిట్టుకోవడంలోపాటు ఒకరికొకరు చెంపలపై కొట్టుకున్నారు.
కాగా, అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు కొంతసేపు ఇద్దరి మహిళల గొడవను కళ్లప్పగించి చూశారు. ఆ తర్వాత జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసి పక్కకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరి మహిళల ఫైటింగ్‌ను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A shocking incident has come to light that a fierce fight took place between women at the Pimpalgaon toll booth near Nashik. @IGPNashikRange pic.twitter.com/1PwGTugSqo
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) September 15, 2022