న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు (Viral video) ఒక్కోసారి విచిత్రమైన కారణాలతో వైరల్ అవుతుంటాయి. ఇదే తరహాలో ఓ షాపును ఆనుకుని ఉన్న హైటెన్షన్ వైర్లలో స్కూటర్ చిక్కుకున్న వీడియో నెటిజన్లను కన్ఫ్యూజన్కు గురిచేస్తోంది.
అసలు స్కూటర్ అక్కడకు ఎలా చేరిందనే సందేహం నెటిజన్లను వెంటాడుతోంది. జమ్ములో ఈ వీడియోను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. జూన్ 18న తుపాన్ కారణంగా స్కూటర్ ఆ వైర్లలో చిక్కుకుందని భావిస్తున్నారు. ఈ వీడియోకు…స్కూటీని సురక్షిత ప్రాంతంలో పార్క్ చేయి అని తండ్రి చెబుతుండగా కూతురు సరే నాన్న అంటోందనే క్యాప్షన్ ఇచ్చారు.
beta scooty kahi safe jageh par park kar dena
Didi : haanji papa pic.twitter.com/5l7pfR7nOB
— SwatKat💃 (@swatic12) June 20, 2023
ట్విట్టర్ యూజర్ స్వత్కాత్ ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేశారు. ఈ వీడియోపై పలువురు రియాక్టవుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ అయి ఉంటుంది..డైరెక్ట్ చార్జింగ్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :