Viral Video | దేశీ స్నాక్స్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకూ పకోడీ, పలు రకాల బజ్జీలను ఇష్టపడుతుంటారు. ఇక ఆనియన్ పకోడీ, ఆలూ భజియా నుంచి చికెన్ పకోడీ, ఫిష్ పకోడీ వంటి నాన్ వెజ్ వెరైటీల వరకూ ఎన్నో ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. ఇక ఫుడ్ ఎక్స్పరిమెంట్స్ పెరిగిన క్రమంలో పకోడా పేస్ట్రీ, పార్లే-జీ పకోడీల వరకూ వెరైటీ కాంబోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
తాజాగా ఓరియా బజ్జీ మేకింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరలవుతోంది. ఆన్లైన్లో ఈ వీడియో చక్కర్లు కొడుతుండగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇన్స్టాగ్రాం వీడియోలో విక్రేత ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్‌ను ఓపెన్ చేయడం కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కటిగా బిస్కెట్స్‌ను పిండిలో కలిపి వోక్‌లో డీప్ ఫ్రై చేయడం చూడొచ్చు.
ఆపై వాటిని వేడి నూనె నుంచి బయటకు తీసి వేడివేడిగా సర్వ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఓరియో బజ్జీ..అహ్మద్‌బాద్‌లో తొలిసారి అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఓరియో బజ్జీని తామసలు ఊహించలేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ వీడియోను ఫ్రెండ్‌కు పంపితే అతడు ఓరియోస్ తినడం మానేస్తాడని మరో యూజర్ రాసుకొచ్చారు. మరీ చెత్త టేస్ట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది మహా పాపం అని మరికొందరు కామెంట్ చేశారు.
Read More :
Animal Movie | ఓటీటీలోకి రాబోతున్న ‘యానిమల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?