అమ్మ సహనానికి మారుపేరు. పిల్లలు ఎంత అల్లరిచేసినా ఓపికగా ఉంటుంది. పిల్లలను లాలిస్తుంది. ఓర్పుతో పిల్లలను పెంచి పెద్దచేస్తుంది. అందుకే అమ్మంటే ఇష్టపడని పిల్లలుండరు. కాగా, అమ్మ ప్రేమ, సహనాన్ని కళ్లకుకట్టే సింహాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా తల్లి సింహాన్ని ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోలో తల్లి సింహం నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. పిల్ల సింహాలు దాని తోకపట్టి లాగుతాంటాయి. ఇంకో బుల్లి సింహం తల్లి వీపుపైకి ఎక్కి కిందకు దూకుతూ ఉంటుంది. అయినా తల్లి సింహం కోంప తెచ్చుకోదు. సహనంతో తనపని తాను చేసుకొనిపోతుంది. ‘దేవుడి తర్వాత తల్లులకే ఎక్కువ ఓర్పు ఉంది’ అని సుశాంత నంద ఈ వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ‘తల్లి అంటే తల్లే’ అని ఒకరు వ్యాఖ్యానించగా, ‘తల్లిగా ఉండడమంటే అంత ఈజీ కాదు.. ఎన్నో భరించాలి’ అని మరొకరు కామెంట్ చేశారు.
Only god has more patience than mothers 💕
VC: Extremenature pic.twitter.com/JYp7lCAiOW— Susanta Nanda IFS (@susantananda3) June 14, 2022