Viral Video | భారతీయ వంటకాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది వేరే చెప్పనక్కర్లేదు. సుగంధ ద్రవ్యాలు.. అంటే మసాలాలు దట్టించి తయారు చేసే వంటకాలకు ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. ప్రపంచంలో ఏ మారుమూల వారైనా సరే జీవితంలో ఒకసారైనా మన వంటకాలను రుచి చూడాల్సిందే. ఆస్ట్రేలియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్లింది ఆ దేశ చిన్నారి. తొలిసారి భారతీయ వంటకం కధాయి చికెన్‌తో భోజనం చేసింది. అటుపై మ్యాంగో కుల్ఫీ కూడా టేస్ట్ చేసింది.
దీనిపై ఆమె చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అభిప్రాయాలు నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. భారతీయ వంటకం ఒకసారి రుచి చేస్తూ ఎల్లవేళలా ఆ అనుభవం షేర్ చేసుకోవాలనిపిస్తుంది అని క్యాప్షన్ రాశారు.
ఈ నెల ప్రారంభంలో సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియోకు వేల లైక్‌లు వచ్చాయి. ఆ చిన్నారి తాను భోంచేసిన రెస్టారెంట్లో సర్వర్లు ఆమెకు స్నేహితులయ్యారు. ఒక మహిళతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఒకసారి భారతీయ వంటకం రుచి చూస్తే మళ్లీ మర్చిపోరు అని ఒకరు రాస్తే, మరొకరు ఆమె భారతీయ వంటకాలను ప్రేమిస్తారు అని పేర్కొన్నారు.