భోపాల్: ఒక చిరుత పులి గేట్ దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగినది చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఇంటి గేటు వెనుక ఉన్న చిరుతను చూసిన పెంపుడు కుక్క మొదట మొరుగుతుంది. చిరుత ముందుకు వస్తుండటం చూసి భయంతో వెనుకకు పారిపోతుంది. అయితే ఆ చిరుత ఒక్కసారిగా గేటు దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తుంది. ఆ పెంపుడు కుక్కపై దాడి చేసి దానిని నోట కరుచుకుంటుంది. ఆ వెంటనే గేట్ పక్కగా ఉన్న ప్రహరీ గోడ మీద నుంచి దూకి బయటకు పారిపోయింది. ఇదంతా ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డైంది.
ఈ షాకింగ్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ నెల 24న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఆ చిరుతను చూడండి. ఇతరులకు ఏ అవకాశం లేదు’ అని శీర్షిక పెట్టారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో జరిగినట్లు ఒక ట్విటర్ యూజర్ పేర్కొన్నారు.
కాగా, పర్వీన్ కస్వాన్ మరో ట్వీట్ చేశారు. ఒకపెంపుడు కుక్క మెడకు ఇనుప ముళ్ల కవచం ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ‘కొందరికి ఇది అసాధారణమైన దృశ్యం. కానీ, కొండ ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాలలో చిరుత పులులు సాధారణంగా కుక్కలను వేటాడతాయి. దీంతో స్థానిక ప్రజలు తమ పెంపుడు జంతువుల మెడకు ఇలాంటి ఇనుప రక్షణ కవచం ఉంచుతారు. పులుల బారి నుంచి ఇది వాటిని కాపాడుతుంది. అలాగే చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు కూడా చిరుతలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి’ అని పేర్కొన్నారు.
This is unusual sight for some. But in many regions including hilly areas Leopards usually hunt dogs. So local people keep a iron collar over their pets. Which save them.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 24, 2021
Also in many regions stray dogs are huge trouble for leopards. One example from Reddit. pic.twitter.com/YFErLiD1VQ