Viral video | బడిలో పంతులమ్మల ఫైటింగ్.. అది చూసి విద్యార్థులు పరేషాన్
Viral video | వాళ్లు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులమ్మలు..! కానీ తరగతి గదిలో విద్యార్థుల ముందే అసభ్య పదజాలంతో దూషించుకున్నారు..! అంతటితో ఆగక ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు..! కొట్టుకుంటూనే క్లాస్ బయటికి వచ్చారు..! బయట కూడా జుట్లుజుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు..!
పట్నా: వాళ్లు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులమ్మలు..! కానీ తరగతి గదిలో విద్యార్థుల ముందే అసభ్య పదజాలంతో దూషించుకున్నారు..! అంతటితో ఆగక ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు..! కొట్టుకుంటూనే క్లాస్ బయటికి వచ్చారు..! బయట కూడా జుట్లుజుట్లు పట్టుకుని దాడి చేసుకున్నారు..! తమ కళ్ల ముందే టీచర్లు కొట్టుకోవడం చూసి విద్యార్థులు విస్తుపోయారు..! చివరికి తోటి ఉపాధ్యాయులు జోక్యం చేసుకుని విడదీయడంతో గొడవ సద్దుమణిగింది..! బీహార్ రాజధాని పట్నాలోని బిహ్త ప్రాంతంలోగల ఓ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బిహ్తలోని ఖౌడియా పంచాయతీ స్కూల్లో కంటి కుమారి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. అదే స్కూల్లో అనిత కుమారి అనే మహిళ కూడా ఉపాధ్యాయురాలు. క్లాస్ రూమ్ కిటికీ మూసే విషయంలో వారి మధ్య గొడవ మొదలైంది. క్లాస్ రూమ్ కిటికీ మూసేయమని ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించగా అందుకు ఉపాధ్యాయురాలు అనిత కుమారి నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చివరికి జుట్లుజుట్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలికి మరో యువ ఉపాధ్యాయిని కూడా తోడైంది. ఇద్దరు కలిసి ప్రధానోపాధ్యాయురాలిని చెప్పులతో, కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానికంగా ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఘటనపై దర్యాప్తు జరిపించి టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు. కాగా, ఆ వీడియోలో పంతులమ్మల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సంస్కారం నేర్పాల్సిన పంతులమ్మలే ఇలా అనాగరికంగా కొట్టుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కింది వీడియోలో పంతులమ్మల కొట్లాటను మీరూ ఓసారి వీక్షించండి..
Yehi video h…
Match 2 on 1 handicap ho gyaa pic.twitter.com/00DxemhYJq— Vatsa P (@pvatsa099) May 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

