భోపాల్: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం ఇండోర్లో కూలి పనులు చేస్తూ జీవనం గడుతున్నాడు. దీంతో ఆమె హిరపూర్లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. అయితే పక్కింట్లో ఉండే గణేశ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆమెను దూషిస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం పూటుగా తాగొచ్చిన గణేశ్.. నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్లి తిట్టడం మొదలు పెట్టాడు. అడ్డుకున్న ఆమెను కులం పేరుతో దూషించాడు. గొడవ పెద్దదవడంతో గణేశ్.. భార్య, తల్లి అతనికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు గుంజుకొచ్చారు. రెండు చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టేశారు. అనంతరం ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె స్థానికుల సహాయంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింది కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది తెగా షేరింగ్ అవుతున్నది.
On Camera, Elderly Woman's Hands Tied, Thrashed In Madhya Pradesh https://t.co/Jxqcu5uPWG pic.twitter.com/opcaLype9K
— NDTV (@ndtv) February 4, 2023