న్యూఢిల్లీ, నవంబర్ 18: హర్యానాకు చెందిన ఓ వైద్యుడు ఆవుపేడను (cow dung) తిన్నారు. అది దేహాన్ని, మనసును పవిత్రం చేస్తుందని సెలవిచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఆ డాక్టర్ పేరు మనోజ్ మిట్టల్ (Dr Manoj Mittal). ఎంబీబీఎస్, ఎండీ చదివారు. హర్యానాలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించారు. తర్వాత ఆవుపేడను తీసుకొని తిన్నారు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడ తినేవారని తెలిపారు. ఈ వీడియోను మొదట ‘వైరల్ హర్యానా’ అనే వెబ్సైట్ పోస్ట్ చేయగా… దానిపై నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు.
Oh my God. I am short of words. https://t.co/fDFFcoPcp5
— A Skin Doctor (@askindoctor) November 16, 2021
Dear Doctors of Twitter,
— عادل مغل 🇵🇸 (@MogalAadil) November 13, 2021
I present you this gentleman!pic.twitter.com/YtFHGo9cQH