న్యూఢిల్లీ: సమాజంలో ప్రతిభకు కొదవలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. గతంలో ప్రతిభను నిరూపించుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉండేది. కానీ ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే నిరూపించుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందు సోషల్ మీడియా చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కానిస్టేబుల్ తన మధురగానంతో అద్భుతంగా పాటపాడి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.
అర్జిత్ సింగ్ అభినయం చేసిన ప్రఖ్యాత ‘తు మేరా కోయి నా.. హోకే భి కుచ్ లగే’ పాటను గిటార్ వాయిస్తూ తన మధుర గాత్రంతో పాడి నెటిజన్ల మనసు దోచుకున్నాడు. ఈ ఒక్కపాటతో లక్షల మంది నెటిజన్ల కళ్లు ఆయన మీద పడ్డాయి. సంగీత ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్‌గా భావించవచ్చు. రజత్ రాథోడ్ అనే ఢిల్లీ కానిస్టేబుల్ ఈ పాట పాడి తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కానిస్టేబుల్ రజత్ సింగ్ కారులో కూర్చుని గిటార్ వాయిస్తూ పాట పాడుతున్నాడు. వినసొంపైన అతని గాత్రం వింటే మనసు ప్రశాంతంగా అనిపించడం ఖాయం. ఈ వీడియో పోస్టు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4,14,000 మంది వీక్షించారు. మరో 41 వేల మంది లైక్ చేశారు. అంతేగాక పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వావ్.. మీ గాత్రం హృదయాలను టచ్ చేసింది అని కొందరు, ఒక ఆనందమైన ఫీలింగ్ కలిగిందని మరి కొందరు, వారెవ్వా.. ఈయన వాయిస్ చాలా మధురంగా ఉంది, ఎవరైనా సినిమా వాళ్లు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అని ఇంకొందరు, ఇలా పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం రజత్ రాథోడ్ కమ్మటి గాత్రాన్ని మనం కూడా ఒకసారి విని ఆస్వాదిద్దాం..