న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో స్థానికులతోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అదనపు పోలీస్ బలగాను రప్పించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
కాగా, హనుమాన్ ర్యాలీల నేపథ్యంలో జహంగీర్‌పురి సమీప ప్రాంతాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చిన్నపాటి ఘర్షణలు జరిగాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. అదనపు బలగాలను పంపి పరిస్థితిని చక్కదిద్దినట్లు చెప్పారు. ఢిల్లీలో ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేస్ అస్థానాతో మాట్లాడారు. హింసాకాండను నివారించే చర్యలు చేపట్టాలని ఆదేశించించారు.
మరోవైపు హనుమాన్ జయంతి ర్యాలీపై రాళ్ల దాడిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతి నెలకొనేందుకు అందరూ చేతులు కలిపి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Delhi | Heavy security deployed in the Jahangirpuri area after a clash between two groups. pic.twitter.com/srp5AZQuix
— ANI (@ANI) April 16, 2022