బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు వింటేజ్ కార్లు (Vintage Car) తళుక్కున మెరిసాయి. ఆనాటి మేటి కార్లను చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. తుమ్కూరు దసరా ఉత్సవాల్లో భాగంగా వింటేజ్ కార్ షో నిర్వహించారు. బెంగళూరులోని విధాన సభ నుంచి కార్లు నగరంలో పరుగులుతీశాయి. ఈ ర్యాలీలో అంబాసిడర్, వోక్స్ వ్యాగన్, రోల్స్‌రాయిస్, వోల్వో, షెవర్లే, బెంట్లీ సంస్థలకు.. చెందిన అరుదైన పాత కార్లను వాటి యజమానులు ప్రదర్శనకు తెచ్చారు. దేశం నలుమూలల నుంచి వింటేజ్ కార్లు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
#WATCH | Karnataka: Ahead of Dussehra, a vintage car show organised in front of Vidhana Soudha in Bengaluru as part of Tumkuru Dasara Utsav 2024. pic.twitter.com/aCT9K4jtLl
— ANI (@ANI) October 11, 2024
ఇలాంటి కార్లను మెయింటేన్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ.. యజమానులు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు చిన్నారుల నుంచి అన్ని వయసుల వారు ఆసక్తి కనబరిచారు. ఆధునిక కార్లకు వాటికి మధ్య తేడాను చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటి కార్ల కంటే పాత కార్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు.
#WATCH | Karnataka: Ahead of Dussehra, a vintage car show organised in front of Vidhana Soudha in Bengaluru as part of Tumkuru Dasara Utsav 2024. pic.twitter.com/hYzCQfQ8KL
— ANI (@ANI) October 11, 2024