న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. జులానా నియోజవకర్గం నుంచి పోటీ చేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat) ప్రస్తుతం పుంజుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసే వరకు ఆమె తన ప్రత్యర్థి కన్నా 38 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓ దశలో రెజ్లర్ వినేశ్ వెనుకంలో ఉన్నారు. అయిదు రౌండ్ల లెక్కింపు వరకు ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం వెనుకబడ్డారు. ఏడు రౌండ్లు ముగిసే వరకు వినేశ్‌కు 30303 ఓట్లు, యోగేశ్‌కు 30265 ఓట్లు పోలయ్యాయి. ఓవరాల్‌గా హర్యానాలో బీజేపీ 49 సీట్లతో ఆధిక్యంలో ఉన్నది. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్నది. అయితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెజ్లర్ వినేశ్ తాజా సమాచారం ప్రకారం 12 రౌండ్లు పూర్తి అయ్యే వరకు 4,988 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.