న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఒలింపియన్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన ఫోగట్, పునియా రైల్వేలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్‌గా ఏఐసీసీ నియమించింది.31 మందితో కాంగ్రెస్ జాబితా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. వినేశ్ ఫోగట్‌ను జులానా నుంచి బరిలో నిలిపింది.
హర్యానా బీజేపీకి వరుస షాక్‌లు
అసెంబ్లీ ఎన్నికల కోసం 67 మంది బీజేపీ విడుదల చేసిన మొదటి లిస్టులో 40 మందిని మార్చడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. టికెట్ దక్కని మంత్రి రంజిత్ చౌతాల, మాజీ మంత్రి సావిత్రి జిందాల్, పలువురు నేతలు రాజీనామా చేశారు. మరోవైపు అత్యాచార కేసులో దోషి అయిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా)కు ఆరుసార్లు పెరోల్ ఇచ్చిన జైళ్ల శాఖ మాజీ అధికారి సునీల్ సంగ్వన్కు బీజేపీ దాద్రి టిక్కెట్ ఇవ్వడం వివాదంగా మారింది.