ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సెనా (64) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ వినయ్ కుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం రాజ్భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.
వినయ్ కుమార్ సక్సెనా ఈ బాధ్యతలు చేపట్టే ముందు వరకూ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది వరకూ ఎల్జీగా ఉన్న అనిల్ బైజల్ వ్యక్తిగత కారణాలతో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో… ఆయన స్థానంలో వినయ్ కుమార్ సక్సెనా బాధ్యతలు చేపట్టారు.