Himachal Pradesh crisis | విక్రమాదిత్య సింగ్ నా సోదరుడు.. ఆయన రాజీనామాను ఆమోదించే ప్రశ్నే లేదు: హిమాచల్ సీఎం
Himachal Pradesh crisis | హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామాపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు తన సోదరుడితో సమానమని చెప్పారు. విక్రమాదిత్య సింగ్ రాజీనామాను ఆమోదించే ప్రశ్నే లేదని అన్నారు. ఆయన బాధలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామాపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు తన సోదరుడితో సమానమని చెప్పారు. విక్రమాదిత్య సింగ్ రాజీనామాను ఆమోదించే ప్రశ్నే లేదని అన్నారు. ఆయన బాధలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు. (Himachal Pradesh crisis) కొంత మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సీఎం సుఖ్విందర్ సింగ్ ఆరోపించారు. అయితే బీజేపీ ప్రయత్నం విఫలమైందని అన్నారు. అలాగే తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
కాగా, మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారు. విక్రమాదిత్య సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
మరోవైపు హర్యానాలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సెషన్లో పాల్గొనేందుకు బుధవారం సిమ్లాకు తిరిగి వచ్చారు. అసెంబ్లీ సమావేశంలో గందరగోళం సృష్టించిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యల అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

