బెంగళూరు, సెప్టెంబర్ 16: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర నాయకత్వాన్ని తాము ఎంతమాత్రం ఒప్పుకోబోమని మాజీ మంత్రి, గోకక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి స్పష్టం చేశారు. విజయేంద్ర పార్టీలో జూనియరే కాక, అవినీతిపరుడన్న ముద్ర కూడా ఉందని ఆయన అన్నారు. పైగా అతనికి ఎలాంటి భావజాలం లేదని, ఈ క్రమంలో తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై అధిష్ఠానం పునరాలోచన చేయాలని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిగా విజయేంద్ర కొనసాగడాన్ని వ్యతిరేకిస్తానని అన్నారు.