చెన్నై: తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కేంద్ర ప్రభుత్వం ‘వై’ క్యాటగిరీ భద్రతను కల్పించింది. దీని ప్రకారం ఆయనకు 8 మంది భద్రత కల్పిస్తారు. వీరిలో సాధారణ పోలీసులు, ఒకరిద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు ఉంటారు.
నిర్దిష్టమైన ముప్పు ఉన్నవారికి ఇటువంటి భద్రత కల్పిస్తారు. విజయ్ నిరుడు ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు. 2026లో జరిగే తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.