చెన్నై, అక్టోబర్ 27: కరూర్ తొక్కిసలాట ఘటన బాధితుల కుటుంబాలను టీవీకే చీఫ్ విజయ్ సోమవారం కలుసుకున్నారు. మహాబళిపురంలోని ఓ రిసార్ట్‌లో బాధితులతో మాట్లాడిన విజయ్, వారిని ఓదార్చినట్టు తెలిసింది. బాధిత కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది రిసార్ట్‌కు చేరుకున్నారు. ప్రతి ఒక్క కుటుంబంతో విజయ్ వివరంగా మాట్లాడినట్టు టీవీకే పార్టీ నాయకులు తెలిపారు.