High Court | బెంగళూరు: ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సెక్షన్ 67బీ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఇటువంటి మెటీరియల్ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మాత్రమే నేరం అవుతుందని చెప్పింది.
2022 మార్చిలో నిందితుడు చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్ను చూసినట్లు సైబర్, ఎకనమిక్, నార్కొటిక్స్ పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేసింది. పిటిషనర్ తన వాదనలో, పోర్నోగ్రఫీకి బానిసనయ్యానని, అయితే, ఆ మెటీరియల్ను ఇతరులకు పంపించలేదని చెప్పారు.