Chirag Paswan | చిరాగ్ పాశ్వాన్.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత మీడియా పతాక శీర్షికల్లో ఆయన పేరు మార్మోగుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడంతోపాటు నరేంద్రమోదీ 3.0 క్యాబినెట్లో చోటు కూడా దక్కించుకున్నారు. అయితే, చార్మింగ్‌గా, స్టైల్‌గా కనిపించే చిరాగ్ పాశ్వాన్‌పై యువతులు మనస్సు పారేసుకున్నారు. ఈ విషయంలో సోసల్ మీడియాలో చిరాగ్ పాశ్వాన్ ఫోటోలు, వీడియోలో పోటెత్తుతున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌ను యువతులు ప్రశంసల్లో ముంచెత్తున్నారు. ఆ జాబితాలో బోజ్‌పురి సినీ నటి నిషా దూబే చేరిపోయారు.
చిరాగ్ పాశ్వాన్‌ను ప్రేమిస్తున్నానంటూ నిషా దూబే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిషా దూబే వయస్సు 25 ఏండ్లయితే, చిరాగ్ పాశ్వాన్‌కు 45 యేండ్లు. ఆయన మీద మనస్సు పారేసుకున్న నిషా దూబే.. ఇటీవల కేంద్ర మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణం చేస్తున్న వీడియో క్లిప్‌ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై నవాజ్ సిద్దిఖి స్పందిస్తూ.. ‘ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. చిరాగ్ వీడియో ప్లే అవుతుండగా, నిత్యం నవ్వుతూ ఉండే ఆయన అమాయకత్వపు ముఖం చేస్తూ ఎవరైనా మనస్సు పారేసుకుంటారని, నిషా దుబే విషయంలోనూ అదే జరిగిందని రాసుకొచ్చారు.