బెంగళూర్ : కర్నాటకలోని గుల్బార్గాలో ఓ పెండ్లి వేడుకలో షారుక్ ఖాన్‌ను పోలిన వ్యక్తి సంగీత్ ఫంక్షన్లో క్రేజీ స్టెప్స్‌తో అదరగొట్టాడు. ఈ వీడియోలో కింగ్ ఖాన్‌ను తలపిస్తూ హుషారైన మూమెంట్స్‌తో ఆకట్టుకున్న వ్యక్తిని రిజ్వాన్ ఖాన్‌గా గుర్తించారు.
రిజ్వాన్ ఖాన్ ఇన్స్టాగ్రాం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈవెంట్స్, వెడ్డింగ్ ఫంక్షన్లలో పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ రిజ్వాన్ ఈ వీడియోలో షారుక్ ఖాన్ నటించి 2016లో విడుదలైన ఫ్యాన్ మూవీలోని జబ్ర ఫ్యాన్ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు.
రిజ్వాన్ డ్యాన్స్ చేస్తుండగా వివాహ వేడుకకు వచ్చిన అతిధులు చుట్టూ చేరి అతడిని ప్రోత్సహించడం కనిపిస్తుంది. ఈ క్లిప్‌లో రిజ్వాన్ బ్లాక్ సూట్, వైట్ షర్ట్‌లో కింగ్ ఖాన్‌లా కనిపించాడు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి 13,000కు పైగా వ్యూస్ లభించాయి.