ఆగ్రా: భారత వాయుసేనకు చెందిన మిగ్-29 ఫైటర్జెట్ సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయింది. సాధారణ శిక్షణలో భాగంగా పంజాబ్లోని అదంపూర్ నుంచి యూపీలోని ఆగ్రాకు ప్రయాణిస్తున్న ఈ యుద్ధవిమానం సాంకేతిక సమస్య కారణంగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. పైలట్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదన్నారు.