న్యూఢిల్లీ : ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ పండుగ ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది. ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
— Vice President of India (@VPSecretariat) July 21, 2021
పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది. ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.#EidMubarak #EidAlAdha