బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి లీలావతి (85) శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె బెంగళూరు శివారులోని నీలమంగళలో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె 600కుపైగా కన్నడ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు.
‘చంచల కుమారి’తో సినీ అరంగేట్రం చేసిన లీలావతి దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించారు. ‘భక్త కుంబర’, ‘సంత తుకారామ్’, ‘భక్త ప్రహ్లాద’, ‘మాంగల్య యోగ’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు గొప్ప ప్రజాదరణ లభించింది. తెలుగులో ఆమె వాల్మీకి, మర్మయోగి, ఇది కథ కాదు, కార్తీకదీaపం, మరోమలుపు తదితర చిత్రాల్లో నటించారు.