ముంబై, నవంబర్ 19: బాలీవుడ్ సీనియర్ నటి తబస్సుమ్ (78) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారని ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ తెలిపారు. 1944లో ముంబైలో జన్మించిన తబస్సుమ్.. బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్లో వచ్చిన ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ టాక్ షోతో ప్రాచుర్యం పొందారు.