న్యూఢిల్లీ: కరోనా పేషంట్లకు చికిత్స అందించే వైద్యులు, సేవలందించే వైద్య సిబ్బంది స్వీయరక్షణ కోసం పీపీఈ కిట్లు ధరిస్తున్నారు. గంటల తరబడి ఈ కిట్లు ధరించడం వల్ల వారు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లోపల గాలి ఆడదు. ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు కొత్త ఆలోచన చేశారు. పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా, లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్-టెక్ వెంటిలేషన్ సిస్టమ్’ను నడుము వద్ద పీపీఈ కిట్‌కు జత చేసుకోవచ్చు.