Mega Ladies | మెగా లేడీస్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన అన్నా లెజినోవా .. నెట్టింట వైరల్
Mega Ladies | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కనెక్ట్ అవుతూ, మెగా కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Mega Ladies | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కనెక్ట్ అవుతూ, మెగా కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అన్నా లెజినోవా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన తర్వాత, మెగా అభిమానులు ఆమె అకౌంట్‌ను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫ్యామిలీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫోటోలో మెగా కుటుంబంలోని మహిళలు అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విశేషం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మజ, అన్నా లెజినోవా, అలాగే చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు కలిసి ఉన్నారు. ఒక కుటుంబ వేడుక సందర్భంగా ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. మెగా కుటుంబంలో సాధారణంగా కనిపించని ఈ తరహా ఫ్యామిలీ మూమెంట్స్‌ను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా మెగా కోడళ్ళు, ఆడపడుచులు అందరూ కలిసి ఒకే ఫోటోలో కనిపించడం అరుదైన విషయం కావడంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
అభిమానులు ఈ ఫోటోపై తమ స్పందన తెలియజేస్తూ, “మెగా ఫ్యామిలీ బాండింగ్ సూపర్”, “ఇలాంటి ఫోటోలు మరిన్ని షేర్ చేయండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే ఈ ఫోటోను “మెగా లేడీస్ పవర్ ప్యాక్”గా అభివర్ణిస్తున్నారు. మొత్తానికి, అన్నా లెజినోవా సోషల్ మీడియా ఎంట్రీతో మెగా కుటుంబానికి సంబంధించిన అనేక అరుదైన క్షణాలు అభిమానులకు చేరువ అవుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ప్రత్యేక ఫోటోలు, అప్డేట్స్ షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

