Illegal construction | తిమ్మాపూర్, మార్చి 31 : తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తున్నారు. పశువుల ఆసుపత్రి సమీపంలో పర్మినెంట్ గా రేకుల షెడ్ వేస్తున్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు. గతంలో ఇక్కడ వినాయక చవితి సందర్భంగా దేవుడి విగ్రహాలను ప్రతిష్టించే స్థలం కాగా ప్రస్తుతం పక్కాగా రేకులు వేస్తుండడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలను అనుమతించని అధికారులు ఇక్కడ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్డు వేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.