చెన్నై: తమిళనాడు రాజకీయాలకు బ్రాహ్మణ వర్గానికి మధ్య వ్యతిరేకత ఉందనే భావాన్ని నూతన సీఎం విజయ్ తుడిచిపెట్టేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచెయ్యి చూపాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.
మైలాపూర్ టికెట్‌ను వెంకట రమణన్‌కు, శ్రీరంగం టికెట్‌ను రమేశ్‌కు కేటాయించారు. ఇప్పడు విజయ్ క్యాబినెట్లో వెంకట రమణన్‌కు స్థానం దక్కింది. విజయ్‌కు ఆప్తమిత్రుడైన వెంకట రమణన్ వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్.