Venkaiah Naidu: సస్పెన్షన్పై పునరాలోచన చేయండి.. రాజ్యసభ ఛైర్మన్కు విపక్ష ఎంపీల వినతి
Venkaiah Naidu: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం విపక్ష పార్టీలకు చెందిన 8 మంది రాజ్యసభ సభ్యులు.. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడును ( Venkaiah Naidu ) కలిశారు.
విపక్ష పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసే విషయమై పునరాలోచన చేయాలని వెంకయ్యనాయుడును కోరారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు క్షమాపణలు చెప్పకుండా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ఇదిలావుంటే తాము ఏ తప్పు చేయలేదని, సభలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని సస్పెండైన ఎంపీలు తెగేసి చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

