(Venkaiah Naidu) న్యూఢిల్లీ: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత అంశాలపై బాల్యం నుంచే ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. టీవీ, రేడియో, పుస్తకాల ద్వారా విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రం వంటి విషయాలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా కృషిజరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. జాతీయ గణితదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, విజ్ఞాన్ ప్రసార్ ఆధ్వర్యంలో భారతీయ శాస్త్రవేత్తల విజయాలను గుర్తుచేసుకుంటూ చేపట్టిన సంబరాలను విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్తోపాటు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన విజ్ఞానవేత్తలందరినీ స్మరించుకున్నారు. రామానుజన్తోపాటు ఎందరో గణిత శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు జాతి నిర్మాణంలో తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని గుర్తుచేశారు. ఈ ఏడాది జన్మశతాబ్ది జరుపుకుంటున్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలైనహరగోవింద్ ఖురానా, జీఎన్ రామచంద్రన్, యెలవర్తి నాయుడమ్మ, బాలసుబ్రమణ్యం రామమూర్తి, జీఎస్ లడ్డా, రాజేశ్వరి చటర్జీలకు నివాళులు అర్పించారు.
భారతదేశ యువతలో శక్తిసామర్థ్యాలకు కొదువలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే భారతీయ భాషల్లో ఈ విషయాలను బోధించడం ద్వారా వారిలో నెలకొన్న ప్రతిభాపాటవాలకు సానబెట్టి ప్రోత్సహించడం ద్వారా దేశనిర్మాణంలో వారందరినీ భాగస్వాములు చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. కృత్రిమమేధ తదితర సాంకేతికతల ప్రయోజనాలను ప్రజల జీవితాల్లో ప్రతిబింబించేలా మరింత కృషి జరగాలని సూచించారు. శాస్ర, పరిశోధన రంగాల్లో ఉన్నవారు తమ పరిశోధనల ఫలాలను ప్రలజకు మరింత చేరువ చేయాలని, ఇందుకోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) బాటలోనే సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీని శాస్త్రవేత్తలు అవలంబించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్, శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, విజ్ఞాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాశర్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..