ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు వెలోమొబైల్. అంటే ఒక ప్రత్యేకమైన సైకిల్ కారు అనొచ్చు. ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మూడు చక్రాల వాహనం ఇటీవల బెంగళూరు వీధుల్లో తలుక్కుమంది. ఏరోడైనమిక్ పద్ధతిలో రూపొందించిన ప్రొటెక్షన్ కవర్‌తో ఉన్న ఈ బండితో ట్రాఫిక్‌లో కూడా ఇతర వాహనాలను తప్పించుకుంటూ రయ్య్ మంటూ దూసుకెళ్లొచ్చు. దీని విలువ రూ.15 లక్షలకు పైగా ఉంటుంది.