ముంబై: కారు హారన్ మోగించడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. పలు షాపులు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. (Vehicles Torched) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా పలాధి గ్రామంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కారు డ్రైవర్ హారన్ మోగించి దారి ఇవ్వాలని కోరాడు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమై ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పలు షాపులతోపాటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అదనపు పోలీస్ సిబ్బంది, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తోపాటు అల్లర్ల నియంత్రణ బృందాలను మోహరించారు. ఆ ప్రాంతంలో మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణలకు సంబంధించి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు మంత్రి గులాబ్రావ్ పాటిల్ కాన్వాయ్‌లోని కారు డ్రైవర్ హారన్ మోగించడం ఈ ఘర్షణకు కారణమని మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ గొడవకు ఆ మంత్రి బాధ్యత వహించాలని, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.