హైదరాబాద్: భారత్-అమెరికా సంతతికి చెందిన వీణా రెడ్డి.. మన దేశానికి యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిషన్ డైరక్టర్‌గా ఎంపికయ్యారు. భారత్‌తో పాటు భూటాన్‌లో ఆమె సేవలు అందించనున్నారు. అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్‌లో సభ్యురాలు అయిన వీణా రెడ్డి.. మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. భారత్‌కు యూఎస్ ఎయిడ్ మిషన్ డైరక్టర్‌గా ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ఎయిడ్ తరపున ఇండియాలో సేవలు అందించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వీణారెడ్డి.. యూఎస్ ఫారిన్ సర్వీస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. గతంలో ఆమె కంబోడియాలో యూఎస్ ఎయిడ్ మిషన్ డైరక్టర్‌గా చేశారు. హైతిలోనూ డిప్యూటీ మిషన్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Today we are pleased to welcome @usaid_india’s new Mission Director Veena Reddy. She will lead the U.S. government’s development efforts in India & Bhutan and advance our shared values. https://t.co/6mMRwe4im7 pic.twitter.com/0UkFcqcjwF
— USAID India (@usaid_india) August 5, 2021
అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడానికి ముందు.. వీణా రెడ్డి కార్పొరేట్ కంపెనీలో అటార్నీగా చేశారు. కొలంబియా లా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారామె. చికాగో వర్సీటీలో బీఏ చేశారు. యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ) భారత ప్రభుత్వంతో గత ఏడు దశాబ్ధాల నుంచి భాగస్వామిగా ఉందని, ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇండియాతో పాటు ఇతర దేశాలపైన తీవ్ర ప్రభావం పడిందని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యంతో మెరుగైన భవిష్యత్తును నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు.