Lipstick | తిరువనంతపురం, జనవరి 30: లిప్స్టిక్స్, ఇతర కాస్మటిక్ ఉత్పత్తులతో ఆరోగ్యానికి ముప్పు ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ హెచ్చరించారు. కాస్మటిక్స్‌పై ఆమె తాజాగా తన ఫేస్బుక్ పోస్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. కాస్మటిక్ ఉత్పత్తుల్లో అధిక మోతాదుల్లో మెర్క్యురీ, ఇతర ప్రమాదకర రసాయనాలు ఉంటున్నట్టు ఆమె చెప్పారు.
ఇది ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. కాస్మటిక్స్ కొనేముందు వినియోగదారులు ఆ ఉత్పత్తుల గురించి, తయారుదారు గురించి తెలుసుకోవాలని, లైసెన్స్డ్ కంపెనీలే విక్రయిస్తున్నాయా అనేది చూసుకోవాలని ఆమె సూచించారు. కాగా, మెర్యురీ అధికంగా ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం రంగు మారడం, దద్దుర్లు కావడం, ఉదర, నాడీ సమస్యలు రావడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.