Nanded MP : మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీని 12 రోజుల క్రితం నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.
మెదడుకు ఆక్సిజన్ లేదా రక్త ప్రసరణ సరిగా లేకపోవడంవల్ల ఆయన హైపోక్సిక్ ఇస్కీమిక్ ఎన్సెఫలోపతి అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఎంపీ మృతితో కిమ్స్ ఆస్పత్రి సంతాప ప్రకటన విడుదల చేసింది. ‘ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటలకు మా ప్రియమైన ఎంపీ శ్రీ వసంతరావు బల్వంత్‌రావు చౌహాన్ మృతి చెందారని ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది’ అని పేర్కొంది.
కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని కిమ్స్ వైద్యబృందం ఎంపీ వసంతరావును కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన పరిస్థితి విషమించి మరణించారు.