బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని కర్ణాటకలోని వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో బంద్ పాటించాలని కర్ణాటక జల సంరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ నెల 29న రాష్ట్ర బంద్ నిర్వహించాలని కన్నడ ఉద్యమకారుడు వటల్ నాగరాజ్ నేతృత్వంలోని ‘కన్నడ ఒక్కుట’ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది.