హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వంశీ రామమోహన్ బుర్రా బాధ్యతలను స్వీకరించారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయనకు సీఎండీగా ఉద్యోగోన్నతి లభించింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీల మొదటి బ్యాచ్‌కు చెందిన వంశీ పవర్‌గ్రిడ్‌లో 1993లో చేరారు.
విద్యుత్ ప్రసార, టెలికం రంగాల్లో 33 ఏండ్లకుపైగా ప్రాంతీయ, కార్పొరేట్ స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. పవర్‌గ్రిడ్ రెగ్యులేటరీ సెల్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. పోటీ బిడ్డింగ్‌లోకి పవర్‌గ్రిడ్ ప్రవేశానికి కీలక రూపకర్తగా, విద్యుత్ ప్రసార మారెట్లో కంపెనీని విజయవంతంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.