న్యూఢిల్లీ: వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన 20 మంది బాలలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు.
ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో అసాధారణ విజయాలు, ప్రతిభాపాటవాలు చూపిన బాలలకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలలో క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. విజేతలను రాష్ట్రపతి అభినందించారు.