శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 01:30:27

బెట్టు వీడలే.. గట్టు తెగలే

బెట్టు వీడలే.. గట్టు తెగలే

  • వ్యవసాయ చట్టాలపై ఎటూ తేలని చర్చలు
  • 11వ దఫా చర్చల్లోనూ బెట్టు వీడని ఇరుపక్షాలు

న్యూఢిల్లీ, జనవరి 22: నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య శుక్రవారం జరిగిన 11వ దఫా చర్చల్లోనూ ఎలాంటి ఫలితం తేలలేదు. రెండు పక్షాలూ బెట్టు వీడకపోవటంతో 50 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు పరిష్కారం లభించలేదు. చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేసేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదించగా.. వాటిని పూర్తిగా రద్దుచేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పారు. 

అరగంటే ముఖాముఖి

గత పది దఫాల చర్చలకు భిన్నంగా 11వ దఫా చర్చలు ఎడమొహం పెడమొహంలాగా సాగాయి. 5 గంటలపాటు చర్చలు కొనసాగగా.. రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు అరగంటపాటు కూడా ముఖాముఖి చర్చించకపోవటం విశేషం. అంతేకాకుండా మరో దఫా చర్చలకు తేదీని కూడా నిర్ణయించకపోవటంతో ఇకముందు చర్చలు కొనసాగుతాయో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఉద్యమంలో బయటి శక్తులు ప్రవేశించినందువల్లనే చర్చలు ఫలించటంలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆరోపించారు. 

VIDEOS

logo