న్యూఢిల్లీ : 2007లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ భూల్ భులయ్య మూవీలోని మేరే ధోల్నా సాంగ్‌ను ఉజ్బెకిస్తాన్ సింగర్లు ఆలపించిన వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది. శ్రేయ ఘోషల్, ఎంజీ శ్రీకుమార్ పాడిన ఈ పాట ఇప్పటికీ పాపులర్ ట్రాక్‌గా ప్రతిచోటా వినిపిస్తోంది. ప్రముఖ మ్యూజిషియన్లు, గాయకులు ఈ పాటను ఆలపిస్తూ ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఇక లేటెస్ట్గా ఉజ్బెక్ సింగర్లు స్పష్టమైన హిందీ ఉచ్ఛారణతో ఈ పాటను పాడటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. హవస్ గురుహి మ్యూజిక్ బ్యాండ్‌కు చెందిన సింగర్లు లిరిక్స్‌ను ఎంతో స్పష్టతతో పలకడం విశేషం. ఈ బ్యాండ్ ఇండియన్ మ్యూజిక్ ఆలపించడంలో పేరొందింది. ఈ వీడియో నెట్టింట షేర్ చేయగానే పెద్దసంఖ్యలో వ్యూస్, రియాక్షన్స్ లభించాయి.
ఎంతో ఈజ్‌తో హిందీ వెర్షన్ సాంగ్‌ను ఈ సింగర్లు స్పష్టంగా పాడటం ఆకట్టుకుంది. ప్రతి నోట్ అద్భుతంగా పలికింది. సింగర్ల మధ్య సమన్వయం కూడా చక్కగా ఉందని, స్టాండింగ్ ఒవేషన్ పెర్ఫామెన్స్ ఇచ్చారని ఓ యూజర్ ప్రశంసలు గుప్పించారు. ఇతర గాయకుల కంటే మీరు ఈ పాటను ఎంతో అందంగా, హృద్యంగా పాడారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Jassym Lora: ఆండ్రూ రస్సెల్ భార్య లోరాను చూశారా.. పిక్స్ వైరల్