Viral news : వాళ్లిద్దరిది ప్రేమ వివాహం (Love marriage). పెళ్లి తర్వాత కొన్నేళ్ళపాటు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా గడిపారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్లు చేసుకుంటున్నారు. తన భర్త ఒక ట్రాన్స్ జెండర్ (Transgender) అని, మగాళ్లతో శృంగారం చేస్తున్నాడని భార్య అంటుంటే.. తన భార్య పరాయి మగాళ్లతో తిరుగుతోందని భర్త అంటున్నాడు. మొత్తానికి వీరి గొడవ జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌కు చెందిన వరుణేష్ దూబే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన కొన్నేళ్ళ క్రితం మిసెస్ పాండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు పుట్టాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై మరొకరు విపరీతమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయస్థాయిలో నెటిజన్ల నడుమ చర్చకు దారితీశాయి.
‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్‌లోని మా పుట్టింట్లో వదిలి వెళ్లాడు. ఆయన మా ఇంట్లో ఉంటూ బూతు పురాణం సాగిస్తున్నాడు. నా భర్త ఒక ట్రాన్స్‌జెండర్. అతడు పరాయి మగాళ్లను ఇంటికి పిలిపించుకుంటున్నాడు. మహిళలా దస్తులు వేసుకుని మగాళ్లతో శృంగారం చేస్తున్నాడు. బూతు వీడియోలు చేస్తున్నాడు. ఓ వెబ్సైట్లో నా భర్త వీడియోలు చూశాను. ఆ వీడియోలు మా ఇంట్లోనే తీశారు. మేము అతడితో మాట్లాడటానికి వెళ్తే నన్ను, నా సోదరుడిని కొట్టాడు’ అని మిసెస్ పాండే చెబుతోంది.
ఇదిలావుంటే ‘నా భార్య మంచిది కాదు. నేను ఇంట్లో లేనప్పుడు చాలా మంది మగాళ్లు మా ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఆ విషయంపై నిలదీసినందుకు, నా ఆస్తిలో కొంత కాజేసేందుకు ఇదంతా చేస్తోంది. నా పెళ్లి కారణంగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. నాపై, మా పిన్నిపై వాళ్లు దాడి చేసి ఫోన్ లాక్కెళ్లిపోయారు. డీప్ ఫేక్ వీడియోలు చేసి నా పరువు తీయాలని చూస్తున్నారు’ అని డాక్టర్ వరుణేష్ దూబే ఆరోపిస్తున్నాడు.
ఈ నెల 18న ఇద్దరూ పరస్పరం కలీలాబాద్ కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడంతో విషయం బయటపడింది. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మహేంద్ర ప్రసాద్ ఈ ఘటనపై స్పందించారు. భార్యాభర్తల ఫిర్యాదుల మేరకు తాము వైద్య పరీక్షలు చేస్తామని, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు.