Red alert : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో భారత్ – పాకిస్థాన్ (India – Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉధృతమైన వేళ ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో రెడ్ అలర్ట్ (Red alert) ప్రకటించారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terro attack) నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున భారత సేనలు పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాల (Terror Hide outs) పై ప్రతీకార దాడులకు పాల్పడ్డాయి.
ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డీజీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవేళ పాకిస్థాన్ ప్రతిదాడులకు పాల్పడినా భద్రతాబలగాలకు సహకరించేందుకు పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు. ‘ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారని, కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి రక్షణ కల్పించేలా తాము సిద్ధమయ్యామని యూపీ డీజీపీ తెలిపారు.
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రతి జిల్లా పోలీసులకు, కమిషనరేట్స్కు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్స్‌కు డీజేపీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.