Char Dham Yatra : చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
Char Dham Yatra : చార్ ధామ్ సందర్శించే భక్తుల రోజువారీ పరిమితిని తొలగిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. చార్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యపై ...

డెహ్రాడూన్: (Char Dham Yatra) చార్ ధామ్ సందర్శించే భక్తుల రోజువారీ పరిమితిని తొలగిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. చార్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజులకు..ఈ మేరకు హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ ఆర్సీ ఖుల్బే, జస్టిస్ అలోక్ కుమార్ డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం దాఖలు చేసిన సవరణ దరఖాస్తులో.. యాత్రాదారులపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని కోరింది. భక్తుల సంఖ్యపై పరిమితి ఉండటంలో చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంపాదనపై ప్రభావం చూపుతున్నదని తన పిటిషన్లో ప్రభుత్వం పేర్కొన్నది.
చార్ ధామ్ యాత్రపై నిషేధాన్ని హైకోర్టు గత నెలలో ఎత్తివేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కేదార్నాథ్ ధామ్‌లో 800, బద్రీనాథ్ ధామ్‌లో 1200, గంగోత్రిలో 600, యమునోత్రిలో 400 మంది యాత్రికులను అనుమతించారు.
కరోనా పాజిటివ్ పరీక్ష రిపోర్ట్, టీకా ధ్రువీకరణ పత్రాన్ని యాత్రికులు తప్పనిసరిగా సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మతో కూడిన కోర్టు డివిజన్ బెంచ్ కూడా ఆదేశించింది. దేవాలయాల చుట్టూ ఉన్న ఏ చెరువులోనూ భక్తులు స్నానం చేయడానికి అనుమతించకూడదని కూడా సూచించింది. ఈ ఏడాది జూన్‌లో చమోలి, రుద్రప్రయాగ్తోపాటు ఆలయాలు ఉన్న ఉత్తరకాశి జిల్లాల నివాసితుల కోసం పరిమిత మార్గంలో చార్ ధామ్ యాత్రను ప్రారంభించాలన్న రాష్ట్ర నిర్ణయానంపై హైకోర్టు స్టే విధించింది.
ఇవి కూడా చదవండి..
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

