లక్నో: ఒక మహిళ ఆభరణాల కొనుగోలు కోసం జ్యుయలరీ షాపునకు వెళ్లింది. ఆమె వాటర్ కావాలని అడగటంతో సమీపంలోని షాపు నుంచి వాటర్ బాటిల్ తెప్పించారు. ఆ బాటిల్లోని నీరు తాగిన ఆ మహిళ అది యాసిడ్ అని తెలుసుకుని షాక్ అయ్యింది. ఆమె అస్వస్థత చెందడంతో ఆసుపత్రిపాలైంది. (Acid in Water Bottle) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జూలై 10న సాయంత్రం వేళ ఒక మహిళ అర్జున్ నగర్ ప్రాంతంలోని ఒక జ్యుయలరీ షాపునకు వెళ్లింది. దాహం వేయడంతో మంచినీరు అడిగింది.
కాగా, జ్యుయలరీ షాపు సిబ్బంది సమీపంలోని ఒక షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. ఆ షాపు యజమాని ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ తీసి సిబ్బందికి ఇచ్చాడు. ఆ బాటిల్ అందుకున్న ఆ మహిళ మూత తెరిచి ఒక గుక్క తాగింది. ఆ వెంటనే బాధతో ఆమె అల్లాడిపోయింది. బాటిల్లో ఉన్నది యాసిడ్ అని గ్రహించి షాక్ అయ్యింది. వెంటనే బయటకు పరుగెత్తి ఉమ్మేందుకు ప్రయత్నించింది. ఆ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వాటర్ బాటిల్ అమ్మిన షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ వాటర్ బాటిల్ మూత సీల్ వేసి ఉన్నదని, ఫ్రిజ్ నుంచి దానిని తీసి అలాగే ఇచ్చినట్లు ఓనర్ చెప్పాడు. అయితే ఆ షాపు నుంచి కొన్ని యాసిడ్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యుయలరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A woman in Uttar Pradesh’s Hapur mistakenly consumed acid after she asked for water. The bottle was handed over to her by a shopkeeper at a jewellery store. She was immediately rushed to a hospital and was later referred to Meerut, where she continues to receive treatment. pic.twitter.com/OzCv3aJoR8
— Vani Mehrotra (@vani_mehrotra) July 12, 2026