Triple Talaq | కట్నం కింద స్కార్పియో ఇవ్వలేదని భార్యకు ట్రిపుల్ తలాక్
అదనపు కట్నంగా స్కార్పియో కారు (Scorpio Car) ఇవ్వలేదని కట్టుకున్న భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
లక్నో: అదనపు కట్నంగా స్కార్పియో కారు (Scorpio Car) ఇవ్వలేదని కట్టుకున్న భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 2015లో ముస్లిం కట్టుబాట్ల ప్రకారం తమకు వివాహమైందని, ఆ సమయంలో కట్నంగా రూ.15 లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే వివాహం అయిన తర్వాత అదనపు కట్నం కోసం తన భర్తతోపాటు, అత్తింటివారి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపింది. అతని డిమాండ్లు తీరకపోవడంతో మానసికంగా, శారీరకంగా వేధించారని వెల్లడించింది. రెండో పెండ్లి చేసుకుంటానని బెదిరించాడని పేర్కొంది. గతేడాది జూలైలో తనను ఇంటిని వెళ్లగొట్టారని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నానని అందులో తెలిపింది.
అయితే ఈ మధ్య తన భర్త తమ ఇంటికి వచ్చాడని, కట్నం కింద స్కార్పియో కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడని వెల్లడించింది. అయితే దానిని తన తండ్రి విరస్కరించారని, దీంతో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని తెలిపింది. అదనపు కట్నం కోసం తనను వేధించాడని, ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

