లక్నో, డిసెంబర్ 24: పుట్టిన రోజు వేడుకకు పిలిచి దారుణంగా అవమానించటాన్ని తట్టుకోలేక ఒక దళిత బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు తనను దారుణంగా కొట్టి, బట్టలూడదీసి, తనపై మూత్రం పోశారని, ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేస్తామంటూ బెదిరించారని బాధితుడు తల్లిదండ్రులకు తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బస్తీకి చెందిన 17 ఏండ్ల యువకుడు ఈ నెల 20న ఒక పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా, అతనిపై నలుగురు దారుణానికి దిగారు. అతడిని బాగా కొట్టారు. బట్టలూడదీశారు.
అతడిపై మూత్రం పోశారు. దానిని వీడియో తీశారు. అనంతరం తమ ఉమ్మిని నాకాలంటూ అతడిని బలవంతం చేశారు. ఆ వీడియో డిలీట్ చేయమంటూ బాధితుడు ఎంత మొత్తుకున్నా వారు వినలేదు. దీంతో అతను ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆందోళన చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు బస్తీ ఎస్పీ కార్యాలయం ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేయడంతో ఆయన స్పందించి కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి తెలిపారు.