లక్నో: పెద్దల నిర్లక్ష్యం పిల్లలపాలిట శాపంగా మారుతున్నది. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే దాన్ని పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. కానీ కొందరు నిర్లక్ష్యంగా వాటిని అలాగే వదిలేస్తున్నారు. దాంతో తెలిసీ తెలియని చిన్నారులు వాటివైపు వెళ్లినప్పుడు వాటిలో పడిపోతున్నారు. తరచూ దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం ఆడుకుంటూ తెరచివున్న బోరుబావి వైపు వెళ్లిన ఆరేండ్ల చిన్నారి దానిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.
Uttar Pradesh | A six-year-old child fell into a borewell in Hapur district. NDRF team on the spot to rescue the child. pic.twitter.com/sDFXDF07WC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023