న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ మొత్తాలు ఏడాదిలోనే మూడింతలు పెరగడంపై సమాజ సేవకుడు అన్నాహజారే లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది. యూపీఏ హయాంలో ఇదే అంశంపై హజారే చేసిన విమర్శలను గుర్తు చేసింది.
ఈ విషయమై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ… ‘అన్నాహజారే లేవండి, స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు మూడింతలైంది’ అని పేర్కొన్నారు. యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహించడం ద్వారా అన్నాహజారే దేశవ్యాప్త ప్రాముఖ్యం పొందారు.